Bheemla Nayak Movie: ఫుల్ గా హర్ట్ అయిన నిత్యామీనన్.. అందుకే వాటికి దూరం!
పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రానా దగ్గుబాటి(Rana Daggubati)
కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’(Bheemla Nayak)
. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే ‘భీమ్లా నాయక్’ వంద కోట్లు మైలురాయిని చేరుకుంది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా నిత్యామీనన్(Nithya Menon) చక్కగా నటించింది. అయితే అంతకుముందు జరిగిన ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిత్యామీనన్ కనిపించకపోవడం అందర్నీ షాక్ కు గురిచేసింది.
తాజాగా ఇందుకు గల కారణం బయటపడింది. భీమ్లా నాయక్ సినిమా నుంచి ‘అంత ఇష్టం ఏందయ్యా’ అనే పాట విడుదల చేయగా చక్కటి స్పందన లభించింది. రిలీజ్ కు ముందే ఈ సాంగ్ భారీ హిట్ అవడంతో సిల్వర్ స్క్రీన్ పై చూడాలని అంతా అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పై ప్రేమతో నిత్యామీనన్ నుంచి నుంచి వచ్చే ఈ సాంగ్ మిగతా సన్నివేశాలకు అడ్డుతగులుతుందనే ఉద్దేశ్యంతో కట్ చేశారట. అయితే తనకి మంచి పేరు తెస్తుందనుకున్న ఈ సాంగ్ తెసేయడంతో నిత్యామీనన్ ఫుల్ హర్ట్ అయిందట. అందుకే భీంల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటుగా భీమ్లా నాయక్ సక్సెస్ సెలెబ్రేషన్స్ కు కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Recent Comment