దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌(RAM CHARAN) కథనాయకులుగా నటిస్తున్న చిత్రం ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌)(RRR). మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో అజయ్ దేవ్‌గన్, సముద్రఖని, శ్రీయ ఇందులో కీలక పాత్రల్లో నటించారు.

ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురూ దుబాయ్‌లో ఉన్నారు. అక్కడి మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే దర్శకుడు రాజమౌళి ఈ మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ కి ముందు వచ్చే సీన్స్ అద్భుతంగా ఉంటాయని, ఆ సన్నివేశాలు సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని చెప్పుకొచ్చారు. ఇక ఆర్ఆర్ఆర్‌లో రాంచ‌ర‌ణ్ (Ram Charan) అల్లూరి సీతారామ రాజు పాత్ర‌లో న‌టిస్తుండ‌గా..ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రం భీమ్ పాత్రలో క‌నిపించ‌బోతున్నాడు.