విక్టరీ వెంకటేష్ (Venkatesh) ,మెగాప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej ) హీరోలుగా తమన్నా(Tamannah),మోహరిన్(Mehareen ) హీరోయిన్స్ గా F2 సినిమా వచ్చి ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఇప్పుడు F2 సినిమాకి సీక్వెల్ గా f3 తెరకెక్కుతోంది.సునీల్ (Sunil )రాజేంద్రప్రసాద్ (Rajendra prasad ) ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీ నుండి ఇప్పటికే లబ్ డబ్ సాంగ్(Lab dab Song ) రాగా ఈ పాటకి మంచి స్పందన వచ్చింది. ఇక F3 నుండి మరోక సాంగ్ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా విడుదల చేయనున్నారు .

ఈ సినిమా నుండి రెండో సాంగ్ ఎప్పుడెప్పుడా అని విక్టరీ వెంకటేష్(Venkatesh ) అభిమానులతో పాటుగా వరుణ్ తేజ్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ (Dsp )కంపోజ్ చేసిన f3 రెండో పాట ఫుల్ మాస్ సాంగ్ అని తెలుస్తోంది. అనీల్ రావిపూడి (Anil Ravipudi )దర్శకత్వం వహిస్తున్న F3 సినిమా మే27న రీలిజ్ చేయనున్నారు. ఇక వెంకటేష్ రేచీకటి ఉన్న వ్యక్తిగా వరుణ్ తేజ్ (Varun Tej )మాటలు సరిగ పలకలేని నత్తి వ్యక్తిగా ఫుల్ కామెడీతో పాటు మంచి మసాల యాక్షన్ గా F3 సినిమా రాబోతోంది.