టీమిండియా (Team India )లోనే కాకుండా ప్రపంచ డేంజరస్ ఆటగాళ్ల జాబితాల్లో రోహిత్ శర్మ (Rohit Sharma )ముందు వరుసలో ఉంటాడు. ఇటీవల కెప్టెన్ అయ్యాక రోహిత్ శర్మ మరింత దూకుడుగా ఆడుతున్నాడు.ఇక శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ లో(Ind vs Sl T20 ) రోహిత్ ని ఒక రికార్డ్ ఊరిస్తోంది.టీ20ల్లో హైయెస్ట్ సిక్సులు కొట్టిన ఆటగాడిగా నిలిచేందుకు రోహిత్ కి (Rohit )అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రికార్డ్ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ మార్టిన్ గప్టిల్(Martin Guptil ) పేరు మీద ఉంది.

అతను 112 మ్యాచ్‌లలో 165 సిక్స్‌లు కొట్టాడు.ఇక భారత కెప్టెన్ రోహిత్ శర్మ 122 మ్యాచ్‌లలో 154 సిక్స్‌లు కొట్టాడు. తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రస్తుతం రోహిత్ రెండవ స్థానంలో ఉన్నాడు. శ్రీలంకతో జరిగే టీ20((Ind vs Sl T 20 ) సిరీస్‌లో రోహిత్ 12 సిక్సర్లు కొడితే వరల్డ్ రికార్డ్ నమోదు చేస్తాడు. భారీ సిక్సులు కొట్టే రోహిత్ లంక సిరీస్ తో ఆ రికార్డ్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.