ఐపీల్ మెగా వేలంలో Indian cricketer Deepak Chahar కొత్త రికార్డ్ క్రెయేట్ చేసాడు. ఈ బౌలర్ కోసం తీవ్ర పోటీ పడ్డాయి ప్రాంఛైజీలు.గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన ఛాహార్ ని మళ్ళీ csk టీమ్ పోటీలో ఎక్కడా తగ్గకుండా దక్కించుకుంది.బేస్ ప్రైస్ 2కోట్లతో deepak Chahar వేలం మొదలయింది. టీమ్ ఇండియాతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరపున కూడా దీపక్ ఛాహార్ సక్సెస్ ఫుల్ ప్లేయర్ గా రాణించాడు. ఇక ధోని అండతో csk టీమ్ లో కీలక ప్లేయర్ గా ఎదిగాడు. అందుకె csk టీమ్ ఛాహార్ ని మళ్ళీ దక్కించుకోడానికి తీవ్రంగా పోటీ పడింది. చివరికి 14 కోట్లకు అతన్ని చెన్నయ్ టీమ్ తీసుకుంది.2కోట్లతో మొదలైన ఛాహార్ 14 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం.మరి భారీ ధర దక్కించుకున్న ఛాహార్ అదే స్థాయిలో IPL లో రాణించి Csk విజయాల్లో కీలక పాత్ర వహిస్తాడేమో చూడాలి.ధోనీకి దీపక్ ఛాహార్ మీద ఎక్కువ నమ్మకం ఉంది.ధోని వల్లే IPL వేలంలో ఛాహార్ ని csk ఇంత భారీ ధరకు కోనుగోలు చేసినట్టు తెలుస్తోంది.ఈ ఐపీల్ వేలంలో క్రెకెటర్స్ మీద కోట్ల వర్షం కురిపిస్తున్నాయి ప్రాంఛైజీలు.