ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun )హీరోగా పుష్ప(Pushpa ) సినిమాతో హ్యాట్రిక్ కొట్టిన డైరెక్టర్ సుకుమార్ (Sukumar )ఇపుడు పుష్ప ది రూల్ (Pushpa The Rule )సినిమా తీసేపనిలో ఉన్నాడు. ఈ డైరెక్టర్ తో సినిమా చేయాలని యంగ్ హీరోస్ భావిస్తున్నారు.ఇక సుమార్ డైరెక్షన్ లో చిరంజీవి(Chiranjeevi ) నటించబోతున్నాడు. ఆ విషయాన్నీ సుకుమార్ స్వయంగ తెలియజేసాడు. చిరు,సుక్కు కాంబినేషన్ అనగానే అభిమానులు పెద్ద ఎత్తున సంబరపడ్డారు.

కాని వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నది సినిమా కాదు. ఒక యాడ్ ఫిల్మ్ కొరకు సుకుమార్(Sukumar ) ,చిరంజీవిని(Chiranjeevi ) సంప్రదింపులు జరిపాడు. రియల్ ఎస్టేట్ సంస్థకు చిరు ఒక యాడ్ చేస్తున్నారు. ఈ యాడ్ ని సుకుమార్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక సుకుమార్ ,చిరంజీవి కాంబోలో త్వరలో ఒక మంచి సినిమా రావాలని అభిమానులు ఆశపడుతుంన్నారు.