పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన బాహుబలి (bahubali )సినిమా తర్వాత ప్రభాస్(Prabhas ) క్రేజ్ అమాంతం ఒక్కసారిగా పెరిగింది. ఇక వరుస సినిమాలు లైన్ లో పెట్టిన ప్రభాస్ రాధే శ్యామ్(Radhe shyam ) తో మార్చి నెల 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షక అభిమానులను అలరించటానికి థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాడు.అయితే ఓవర్సీస్ తో పాటు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ ఐమాక్స్ లో రాధే శ్యామ్ సినిమా టిక్కెట్స్ రికార్డ్ స్థాయిలో సేల్ అయ్యాయని సమాచారం. ఇంతకు ముందు ఎన్నడులేని రీతిలో అడ్వాన్స్ బుకింగ్ జరిగిందట.

పిరియాడికల్ ప్రేమ కథగా వస్తున్న రాధే శ్యామ్(Radhe shyam ) లో ప్రభాస్ (Prabhas ),పూజ హెగ్డే (Pooja Hegde )జోడి ఇప్పటికే ఆకట్టుకుంది. ఇక సినిమా హిట్ అయితే ప్రభాస్ కి తిరుగువుండదని చెప్పొచ్చు. విదేశాల్లో ప్రబాస్ కి ఉన్న క్రేజ్ చూస్తుంటే ప్రాజెక్ట్ కె,స్పిరిట్ వంటి సినిమాలకు ఒక రేంజ్ లో క్రేజ్ పెరగడం ఖాయం.రాధే శ్యామ్ చిత్రాన్ని దాదాపు 10 వేల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.