దేశంలో కరోనా మహమ్మారి  కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో పెద్ద సినిమాలు తమ విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ నెల 7న విడుదల కావాల్సి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం వాయిదా పడగా.. ఇప్పుడు భారీ చిత్రం ‘రాధేశ్యామ్‌’ విడుదలను కూడా వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

నిజానికి ఈ సినిమాని జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు చిత్రయూనిట్… కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ‘రాధేశ్యామ్‌’ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. కేకే రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్‌ జోతిష్య నిపుణిడిగా కనిపించనున్నాడు. ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే అలరించనుంది. ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు.