పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్‌ (Prabhas) నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ఆది పురుష్‌ (Adipurush) బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ (Om Raut)
దర్శకత్వంలో తెరకెక్కుతున్న. ఈ సినిమా. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకన్ని ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. అయితే నేడు శివరాత్రి(Mahashivratri) సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఓ కీలక అప్డేట్​ను మేకర్స్ అందించారు.

‘ఆదిపురుష్’​ మూవీని 2023 జనవరి 12న 3డీలో వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, పాన్‌ ఇండియా మూవీ ఆదిపురుష్‌లో ప్రభాస్‌ రాముడి పాత్ర పోషిస్తుండగా కృతి సనన్‌(Kriti Sanon) సీతగా నటిస్తోంది. ఇక సన్నీ సింగ్‌ (Sunny Singh) లక్ష్మణుడిగా కనిపించబోతున్నాడు. రావణుడి పాత్రను సైఫ్‌ అలీఖాన్ (Saif Ali Khan) చేస్తున్నారు. అలాగే ఆదిపురుష్​ (Aadipurush) మూవీ మొత్తం బడ్జెట్ రూ. 400 కోట్లు అని తెలుస్తోంది. సుమారు 15 భారతీయ, అంతర్జాతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఇరవై వేలకు పైగా థియేటర్లలో ఒకేసారి ఆదిపురుష్​ విడుదల​ కానున్నట్లు తెలుస్తోంది.