Prabhas Adipurush Movie Release Date: ‘ఆదిపురుష్’ కొత్త రిలీజ్ డేట్.. మరోసారి సెంటిమెంట్ రిపీట్
బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు నేషనల్ స్టార్ ప్రభాస్(Prbhas). ప్రస్తుతం ఆయన చేస్తున్నవన్నీ భారీ సినిమాలే కావడం విశేషం. ఈ స్టార్ హీరో ప్రస్తుతం ‘సలార్’, ‘ఆదిపురుష్’లో నటిస్తున్నాడు. కాగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ (Adipurush)
సినిమాని వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ తాజాగా మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా.. ఈ చిత్రాన్ని 3D వెర్షన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ అభిమానులు సంబరపడుతున్నారు. రామాయణ గాథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని టీ సిరీస్ నిర్మిస్తోంది. ఇందులో కృతి సనన్(Kriti Sanon) ‘సీత’ పాత్రలో నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) ‘రావణుడి’ పాత్రలో కనిపించనున్నాడు.
అయితే ఈ చిత్రాన్ని తొలుత ఆగస్ట్ 11న విడుదల చేస్తామని ముందుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా కోసం ఆది పురుష్ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. తాజాగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఆగస్ట్‌లో రిలీజ్ చేద్దామనుకున్న ఈ సినిమాను మళ్ళీ సంక్రాంతి వరకు ఎందుకు పోస్ట్ పోన్ చేశారో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. ఆది పురుష్ సినిమా దర్శకుడు ఓం రౌత్ తన తొలి చిత్రం లోకమాన్యను 2015 జనవరి 2న విడుదల చేశారు. ఆ తర్వాత తన మరో చిత్రం తానాజీని జనవరి 10న విడుదల చేశారు. ఈ రెండు సినిమాలు జనవరిలోనే విడుదలై భారీ హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే ఆది పురుష్‌ను కూడా జనవరిలోనే రిలీజ్ చేయాలని ఓం రౌత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Recent Comment