Prabhas On Radhe Shyam Promotions: పెళ్లికి ఇంకా ముహుర్తం ఫిక్స్​ కాలేదు.. అందుకే ఇలా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas)
, బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’
(Radhe Shyam ) రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ముంబయిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ నిర్వహించారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రెస్‌మీట్‌లో ప్రభాస్‌కు పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘రాధేశ్యామ్‌’ ట్రైలర్ లోని ‘ప్రేమ విషయంలో ఆదిత్య ప్రిడిక్షన్‌ తప్పు’ అనే డైలాగ్‌ను గుర్తు చేస్తూ ‘నిజజీవితంలో ప్రేమ విషయంలో మీ లెక్క తప్పిందా?’ అని ప్రభాస్‌ను అడగ్గా… దీనికి ఆయన.. ‘ప్రేమ విషయంలో చాలాసార్లు నా లెక్క తప్పింది. అందుకే నాకింకా పెళ్లి కాలేదు’ అని నవ్వుతూ జవాబిచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చిత్రంగా యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ తల్లి పాత్రలో బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ నటిస్తుండగా.. కృష్ణం రాజు, జగపతి బాబులు కీలక పాత్రలో అలరించనున్నారు.