Sunil New Movie Updates: హీరోగా మళ్లీ దూసుకుపోతున్న సునీల్.. ఒకేసారి రెండు సినిమాలు..

హాస్య నటుడిగా తన సినీ కెరీర్ ప్రారంభించిన సునీల్(Sunil) ‘మర్యాద రామన్న’ చిత్రంతో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆరంభంలో హీరోగా మంచి విజయాల్ని అందుకున్నా తర్వాతి కాలంలో చిత్రాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో మళ్లీ విలన్ గా మారి సినిమాలు చేస్తున్నాడు. డిస్కో రాజా, కలర్ ఫోటో, పుష్ప మూవీలతో విలన్‌గా కూడా మెప్పించాడు. అయితే ఫిబ్రవరి 28 సోమవారం సునీల్ బర్త్ డే సందర్భంగా తాను మళ్ళీ కథానాయకుడుగా నటిస్తున్న సినిమాలను అధికారికంగా ప్రకటించాడు.

కామెడీ సినిమాల డైరెక్టర్ జి. నాగేశ్వర్​ రెడ్డి(GNageswarReddy) దర్శకత్వంలో ‘బుజ్జీ ఇలారా’ (BujjiIlaRaa) చిత్రం చేస్తుండగా.. యువ డైరెక్టార్ అభిరామ్(AbhiramPilla) దర్శకత్వంలో ‘కుంభకర్ణ’ (kumbakarna )సినిమా చేస్తున్నాడు.. ఇక ‘బుజ్జీ ఇలారా’ మూవీలో సునీల్​ పవర్ ఫుల్ ఫోలీస్​ ఆఫీసర్​గా నటిస్తుండగా.. ‘కుంభకర్ణ’చిత్రంలో సూరజ్​ దేవ్​ అనే పాత్రలో నటించనున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తే గనుక సునీల్ మళ్ళీ హీరోగా దూసుకుపోవడం ఖాయమని చెప్పొచ్చు.