Sankranti 2023 Movies: సంక్రాంతి బరిలో ప్రభాస్-చరణ్.. బాక్సాఫీస్ వార్‌కు సై
సంక్రాంతి పండగ వచ్చిందంటే కొత్త సినిమాల విడుదల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. తాము నటించిన సినిమాలు సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాలని ప్రతి హీరో కోరుకుంటాడు. అందుకు తగ్గట్టుగానే కొందరు పెద్ద హీరోలు సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) దిగబోతున్నారు. వీరిద్దరి మధ్య హోరాహోరీగా పోటీ సాగనుంది.
ప్రభాస్ హీరోగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om Raut) తెరకెక్కించిన చిత్రం ‘ఆది పురుష్'(Adipurush). ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసనన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ అలరించనున్నారు.
అయితే తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.. అయితే, అదే సంక్రాంతికి శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్సీ 15’ (RC15) కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు.. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘ఆర్సీ 15’ను రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల తెలిపారు. దీంతో వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ,రామ్ చరణ్‌లు హోరాహోరీగా పోటీపడనున్నారు.
Recent Comment