Varun Tej Ghani: గని మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. థియేటర్స్‌లో పంచ్‌ ఇవ్వడానికి రెడీ!

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌(Varun Tej) హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’(Ghani). ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ సరసన బాలీవుడ్‌ నటి సయీ(Sayi Manjrekar) మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఉపేంద్ర‌(Upendra), సునీల్ శెట్టి(Sunil Shetty), న‌వీన చంద్ర(Naveen Chandra), జగపతి బాబు(Jagapati Babu) త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. వ‌రుణ్‌ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని డిఫ‌రెంట్ క్యారెక్టర్‌లో సరికొత్త లుక్‌లో బాక్సర్‌గా అలరించబోతున్నాడు. అందులోని వరుణ్‌ తేజ్ మాస్‌ లుక్‌ ఇప‍్పటికే మెగా అభిమానులకు తెగ నచ్చేసింది. ఈ మూవీ విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు.

ఇక ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు గని నుంచి బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు చిత్రబృందం. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 8న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ (Geeta Arts) అధికారికరంగా వెల్లడించింది. తమన్‌(Thaman) ఈ సినిమాకు సంగీతం అందించారు.