Jana Gana Mana Update: `జనగణమన`కోసం భారీ స్కెచ్ వేసిన పూరి.. కెరీర్ లోనే మొదటిసారి..

పాన్ ఇండియా మూవీ ‘లైగర్‌’(Liger) తర్వాత రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda), స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌(Puri Jagannadh) కాంబినేషన్‌లో ‘జనగణమన’ (Janaganamana)అనే మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్‌ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ‘లైగర్’ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ నెలాఖరుకి ఈ సినిమా తొలి కాపీని సిద్దం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే లైగర్ తొలి కాపీ వచ్చిన వెంటనే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ఇద్దరు కలిసి `జనగణమన`మూవీ కోసం విదేశాలకు పయణమవనున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి చేసిన పూరి జగన్నాథ్ వెంటనే ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం విదేశాలకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసి చిత్రీకరణ మొదలుపెట్టానున్నారు. ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మిలిటరీ ఆఫీసర్గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్రమంలోనే
లైగర్ కోసం పొడవాటి జుట్టుతో కనిపించిన విజయ్.. జనగణమన కోసం మిలట్రీ హెయిర్ కట్ లోకి మారిపోనున్నాడు.