టీమిండియాలో(India ) బ్యాటింగ్ విభాగం ప్రస్తుతానికి చాలా స్ట్రాంగ్ గా ఉంది .రోహిత్(Rohit ), ఇషాన్ కిషన్(Ishan kishan ) రాహుల్(Rahul ), సూర్యకుమార్ యాదవ్(Surya kumar yadav), శ్రేయాస్ అయ్యర్(Shreyas iyer ) మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ (Kohli )పరిమిత ఓవర్ల క్రికెట్ లో మూడో స్థానంలో వస్తున్న సంగతి తెలిసిందే .కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పరిస్తూ అనేక రికార్డ్స్ బద్ధలు కొడుతున్నాడు. కోహ్లీ తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అభిప్రాయపడుతున్నారు.

మూడో స్థానంలో వస్తున్న శ్రేయస్ (Shreyas )అంచనాలకు తగ్గట్టుగా ఆడుతున్నాడు. దాంతో కోహ్లీ స్థానానికి అర్హుడు శ్రేయస్ అయ్యర్ అని బీసీసీఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొన్న శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ లో కూడా మూడో స్థానంలో వచ్చిన అయ్యర్ అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మాజీలు కూడా ఆ ప్లేస్ కి అయ్యర్ అయితేనే న్యాయం చేయగలడని చెప్తున్నారు. మరి శ్రేయస్ అయ్యర్ కోహ్లీ(Kohli ) స్థానాన్ని భర్తీ చేస్తూ మూడో స్థానంలో భారీ ఇన్నింగ్స్ ఆడతాడేమో చూడాలి.