పవర్ స్టార్ (Pawan kalyan ) భీమ్లా నాయక్(Bheemla Nayak ) వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు విడుదల అయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేష్ షాకింగ్(Nara lokesh ) ట్వీట్ చేసాడు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని భీంలా నాయక్ హిట్ తో సమాధానం చెప్పాలని తెలిపారు.భీంలా నాయక్ రిలీజ్ సందర్భంగా ముందుగా పవన్ కి (Pawan kalyan )అభినందనలు తెలిపారు లోకేష్. సినిమాకి మంచి స్పదన వస్తోందని తాను కూడా మూవీ చూడాలి అనుకుంటున్న అంటూ తెలిపారు.

ఇక భీంలా నాయక్ మీద అలాగే మూవీ పరిశ్రమ మీద ap ప్రభుత్వం చూపుతున్న వివక్ష సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసాడు. జగన్ (Ys Jagan )కుట్రకు పవన్ భీంలా నాయక్ హిట్ తో సమాధానం చెప్పాలని తెలియ చేసాడు.
ఇక భారీ అంచనాలతో వచ్చిన భీంలా నాయక్ అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది.పవన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అంటూ పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేస్తున్నారు.