శర్వానంద్ (Sharwanand )హీరోగా రష్మిక మందన(Rashmika Mandana ) హీరోయిన్ గా ప్రేక్షకులముందుకు రాబోతున్న సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు(Aadavallu meeku joharlu ). ఈ సినిమా ఈ నెల 25 విడుదల కావలసి ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan ) వంటి పెద్ద హిరో నటించిన భీంలా నాయక్ (Bheemla Nayak )విడుదలకావటంతో శర్వానంద్ వెన్నక్కి తగ్గాడు. మార్చి 4న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇటీవల సినిమా నుండీ మాంగళ్యం తుంతున అంటు సాగె సాంగ్ రీలిజ్ చేసారు. ఇక ఇపుడు ఆడవాళ్లు మీకుజోహార్లు సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు టాప్ హీరోయిన్స్ రెడీ అయ్యారు.

ఢి షో లో డాన్సర్ గా వచ్చి ఇక ఫిదా సినిమా తో హీరోయిన్ గా ఎదిగిన అందాల సుందరి సాయిపల్లవి(sai pallavi ) అలాగే మాహానటి సినిమాతో అలనాటి సావిత్రిని తలపించేలా తన నటనతో కట్టి పడేసిన కీర్తిసురేష్ (Keerthy suresh )ఆడవాళ్లు మీకుజోహార్లు ట్రైలర్ రీలిజ్ వేడుకకు గెస్ట్ లుగా రాబోతున్నట్టు సమాచారం.ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. తిరుమల కిషోర్ (Tirumala kishor )ఈ మూవీని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించారు.ఇక థియేటర్స్ లో ఎలాంటి సందడి చేయనుందో చూడాలంటే మార్చి 4 వరకు ఆగాల్సిందే.