భారత్, శ్రీలంక జట్ల (Ind vs Sl T20 ) మధ్య నిన్న టీ 20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక మ్యాచ్ ద్వారా రవీంద్ర జడేజా (Ravindra jadeja )మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. గాయం కారణంగా జట్టుకు దూరం అయిన జడేజా శ్రీలంకతో టి20 సిరీస్‌ తో జట్టులోకి వచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన జడేజా ఒక వికెట్‌ తీసి 28 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్ లో ఎక్కువ పరుగులు చేసే అవకాశం రానప్పటికి బౌలింగ్ లో ఒక వికెట్ తీసి ఆకట్టుకున్నాడు.

ఇక ఈ మ్యాచ్ లో చండిమల్‌ను ( Chandimal )ఔట్‌ చేసాడు.ఈనేపథ్యంలో పుష్ప(Pushpa ) స్టైల్ లో జడేజా ఇచ్చిన స్టిల్ ఇపుడు వైరల్ అవుతోంది. పుష్ప మూవీలో అల్లు అర్జున్(Allu arjun ) గడ్డం నిమురుతూ తగ్గేదెలే అని చెపిన డైలాగ్ ట్రెండ్ అవుతోంది. ఇక నిన్న మ్యాచ్ లో చండి మాల్ ని ఔట్ చేయగానే జడేజా(Jadeja ) తన చేతితో గడ్డాన్ని నిమురుతూ తగ్గేదే లే అని హిందీలో చెప్పడం వైరల్ అవుతోంది.