Manchu Vishnu As Gali Nageshwara Rao : ‘గాలి నాగేశ్వరరావు’గా ముందుకొస్తున్న మంచు విష్ణు
టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) తన కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. గాలి నాగేశ్వరరావు(Gali Nageshwar Rao) టైటిల్ తో రానున్న ఈ సినిమాకి ఈషాన్ సూర్య దర్శకత్వం వహించనున్నారు. డా. మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లేతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్ వ్యవహరించనున్నారు.
జి.నాగేశ్వర రెడ్డి స్క్రిప్ట్ అందించిన ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా చోటా. కె.నాయుడు వ్యవహరిస్తున్నారు. అలాగే భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. పక్కా కమర్షియల్ మూవీగా రూపొందుతున్న గాలి నాగేశ్వరరావు సినిమాలో మంచు విష్ణు ఎలా ఆకట్టుకుంటాడో అన్నది చూడాలి.
Recent Comment