పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan ) అభిమానులు ఎదురు చూసిన భీంలా నాయక్ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. రానా (Rana), పవన్ కళ్యాణ్(Pawan kalyan ) సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా వస్తాయని భావిస్తున్నారు. హిట్ టాక్ తెచ్చుకున్న భీంలా నాయక్ కి ఇప్పుడు పైరసీ పెద్ద షాక్ ఇచ్చింది. రిలీజ్ అయ్యే ప్రతి సినిమాలను మొదటిరోజే నెట్ లో పెట్టేసి తమిళ రాకర్స్ ,మూవీ రూల్స్ వెబ్ సైట్స్ లో భీంలా నాయక్ Bheemla nayak ) కూడా పెట్టేసినట్లు తెలుస్తోంది. దాంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు .

ఇప్పటికే ఓటీటీకి అలవాటు పడుతున్న ప్రేక్షకులు ధియేటర్ కి రావడానికి ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి సమయంలో మొదటి రోజే పైరసీ ఆన్లైన్లోకి వచ్చేస్తే అది భీంలా నాయక్ (Bheemla nayak )కలెక్షన్స్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో భీమ్లా నాయక్ ని ఆన్లైన్లో పెట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. దర్శకనిర్మాతలు కూడా ఈ పైరసీని అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీటిని అన్నిటినీ తట్టుకుని భీంలా నాయక్(Bheemla nayak ) ఏ స్థాయిలో కలెక్షన్స్ ని సాధిస్తాడో చూడాలి.