పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan ) రానా(Rana) నటించిన బిగ్గెస్ట్ మల్టిస్టారర్ భీంలా నాయక్( bheemla nayak )ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది .ఇక యు ఎస్ లో 24 న ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించారు .భీంలా నాయక్ ఓవర్సీస్ లో కనీవినీ ఎరుగని కలెక్షన్స్ సాధిస్తోంది. ఇప్పటివరకు ప్రీమియర్స్ తో పాటు మొదటి రోజు కలెక్షన్స్ తో కలుపుకుని వన్ మిలియన్ డాలర్స్ ను సొంతం చేసుకుంది. అతి తక్కువ టైంలో ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసిన మూవీగా భీంలా నాయక్ రికార్డ్ క్రియేట్ చేసింది.

శుక్రవారం అభిమానులకు ముందు వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్(Pawan kalyan ) ,రానా (Rana )పోటీపడి మరీ నటించారు .పవన్ యాక్షన్ తమన్ (S thaman ) బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది .దాంతో ఈ సినిమా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఓవర్సీస్ లో ఇప్పటికే వన్ మిలియన్ డాలర్స్ వసూల్ చేసిన భీంలా నాయక్ టోటల్ గాఏ స్థాయిలో కలెక్ట్ చేస్తుందో చూడాలి.