టీమిండియాలో( Team India ) ఇటీవల సూపర్ గా రాణిస్తున్న ఆటగాడు ఇషాన్ కిషన్(Ishan Kishan ). వెస్టిండీస్ తో ఆకట్టుకున్న కిషన్ నిన్న శ్రీలంకతో జరిగిన టీ20 లో అదరగొట్టాడు.ఇక ఈ మ్యాచ్ తో కొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు కిషన్.శ్రీలంకతో మొదటి టీ20లో(Ind vs Sl T20 ) 89 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర వహించాడు. టీ 20 ల్లో టీమిండియా తరపున ఒకే మ్యాచ్ లో ఎక్కువ పరుగులు నమోదు చేసిన వికెట్ కీపర్ గా రికార్డు సృష్టించాడు.
ఇప్పటి వరకు ఏ వికెట్ కీపర్ కూడా ఒకే మ్యాచ్ లో ఇన్ని పరుగులు చేయలేదు.ధోని(Dhoni ), దినేష్ కార్తీక్(Dinesh Karthik ) లాంటి సీనియర్ ప్లేయర్స్ అలాగే రిషబ్ పంత్ లాంటి మేటి ప్లేయర్స్ కూడా ఈ రికార్డ్ సాధ్యం కాలేదు.కెరీర్ మొదట్లోనే ఇలాంటి రికార్డ్ క్రియేట్ చేసిన ఇషాన్ కిషన్ కి ప్రశంసలు దక్కుతున్నాయి.ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ (Rohit ) కూడా కిషన్ పామ్ పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.
Recent Comment