పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan )హీరోగా ఇప్పటికే విడుదలైన భీమ్లానాయక్ (Bheemla nayak )సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.ఇక పవన్ కళ్యాణ్ (Pawan kalyan )మిగతా అన్ని సినిమాలు కూడా లైన్ లో పెట్టేసాడు .ఇప్పుడు ప్రస్తుతం హరిహర వీరమళ్లు 70% వరకు చిత్రీకరణ పూర్తి అయింది. మిగతా షూటింగ్ ఢిల్లీలో జరగనుంది. మొఘల్ కాలాంనాటి కథ కావడంతో ఇందుకు ఢిల్లీ 10కోట్లు ఖర్చు చేసి చాందినీ చౌక్ సెట్ నిర్మించారు.

హరిహర వీరమళ్లు సినిమాకి సంబంధించి ముఖ్య సన్నివేశాలు ఈ సెట్ లోనే చిత్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాల్లో దీనికే ఎక్కువ డేట్స్ కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కథనాయికగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi agarwal ) నటిస్తోంది. క్రిష్ (Krish )దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్ బేనర్ పై ఎం రత్న ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.