భారత (India) , శ్రీలంక (Sri Lanka) జట్ల మధ్య  మొహాలీ (Mohali) లోప్రారంభమైన మొదటి టెస్ట్ లో, టాస్ గెలిచి భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

రెండవ రోజు టీ విరామానికి  భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల భారీ స్కోర్ సాధించి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. రవీద్ర జడేజా, తన కెరీర్ బెస్ట్ 175 పరుగులతో అజేయం గా నిలిచాడు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీ లంక రెండవ రోజు ఆట ముగిసే సమయానికి తన తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.  ఇంకా 466 పరుగులు వెనుక బడి ఉంది.

శ్రీలంక బ్యాట్స్ మెన్ ల లో టాప్ ఆర్డర్ ఎవ్వరు కనీసం ౩౦ పరుగులు దాటలేదు.  ఆట ముగిసే సమయానికి, నిస్సంక 26 పరుగులతో, అసలంక 1 పరుగుతో క్రీజ్ లో ఉన్నారు.  శ్రీ లంక ఆశలన్నీ నిస్సంక, అసలంక మీదే.

భారత బౌలర్ల లో అశ్విన్ రెండు వికెట్లు తీయగా, బుమ్రా, జడేజా తలా ఒక వికెట్ తీశారు.

రేపు శ్రీ లంక బ్యాట్స్ మెన్ ఎంతసేపు నిలబడతారో చూడాలి.  భారత జట్టు గెలుపు లాంఛనమే అయినా ఎన్ని పరుగుల తేడాతో గెలుస్తారు, ఎన్ని రోజుల లో మ్యాచ్ ముగిస్తుంది అన్నవి మాత్రమే తెలియాల్సిన విషయాలు