పవన్ కళ్యాణ్ ( Pawan kalyan )లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు (Hari hara veeramallu ).దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో పిరియాడికల్ మూవీగా ఈ సినిమా రాబోతోంది. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమా తీసిన డైరెక్టర్ క్రిష్ హరి హర వీరమల్లు ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయింది. త్వరగా మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేసి దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం నుండి ఒక టీజర్ ని త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు వినిపిస్తోంది .మహాశివరాత్రి (Siva ratri )పండగ సందర్భంగా హరిహర వీరమల్లు నుండి ఒక టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక బందిపోటుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన ఫస్ట్ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.మరి ఫిలింనగర్ లో వినిపిస్తున్నట్లు శివరాత్రికి హరిహర వీరమల్లు నుండి అప్డేట్ వస్తుందా రాదా అన్నది చూడాలి .ఈ మూవీలో పవన్ కి (Pawan kalyan )జోడిగా నిధి అగర్వాల్(Nidhi Agarwal ) నటిస్తోంది.