భారత (India) , శ్రీలంక (Sri Lanka) జట్ల మధ్య  మొహాలీ (Mohali) లోప్రారంభమైన మొదటి టెస్ట్ లో, టాస్ గెలిచి భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

రెండవ రోజు తన ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత జట్టు కు, జడేజా, అశ్విన్ కలిసి ఏడో వికెట్ కు 130 పరుగులు జోడించారు.  అశ్విన్ 61 పరుగులు చేసి ఔట్ అయ్యాడు

రెండవ రోజు టీ విరామానికి  భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల భారీ స్కోర్ సాధించి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. రవీద్ర జడేజా, అద్భుతమైన ఆటతో, లోయర్ ఆర్డర్ తో ఇన్నింగ్స్ ను నిర్మించాడు.  తన కెరీర్ బెస్ట్ 175 పరుగులతో అజేయం గా నిలిచాడు.

ఈ రోజు 2 సెషన్ ల లో కలిపి లంకకు కేవలం రేడు వికెట్లు మాత్రం దక్కాయి.  జడేజా ఊపు చూస్తే డబల్ సెంచరీ చేసేలా కనిపించాడు.  అయితే, జడేజా డబల్ సెంచరీ అయ్యేదాకా ఉండకుండా, ఇన్నింగ్స్ ను రోహిత్ డిక్లేర్ చేయడం కొస మెరుపు.  షమి 20 పరుగులతో జడేజా కు తోడుగా అజేయం గా నిలిచాడు

శ్రీలంక బౌలర్ల లో ఎంబుల్డెనియా, లక్మల్, ఫెర్నాండో  తలా రెండు వికెట్లు తీయగా, కుమార, డిసిల్వా తలా ఒక వికెట్ తీశారు.