Sarkaru Vaari Paata Kalaavathi Second Song:’సర్కారు వారి పాట’ రెండో సాంగ్.. రచ్చ మొదలయ్యేది ఆరోజే!

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(Mahesh Babu), యువ హీరోయిన్ కీర్తి సురేశ్‌(Keerthi Suresh) జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట(Sarkaru Vari Pata). పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా నుంచి ఇటీవల ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ కళావతి సాంగ్‌(Kalaa athi Song)ను మేకర్స్ రిలీజ్ చేయగా.. 60మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ని సాధించి దూసుకెళ్తోంది. థమన్ సంగీతం అందించిన ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు.

ఇదిలాఉంటే.. ఈ సినిమా నుంచి అభిమానులు ఎప్పుటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నరెండో సాంగ్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయింది. తాజా సమాచారం ప్రకారం ‘సర్కారు వారి పాట’ రెండో సాంగ్ మార్చి 18న విడుదల చేయనున్నట్లు సమాచారం. మ్యూజిక్‌ సెన్సెషన్‌ తమన్‌ స్వరాలు అందించిన ఈ పాటపై మరికొన్ని రోజుల్లోనే చిత్రబృందం అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ మే 12వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.