పవన్ కళ్యాణ్(Pawan kalyan ) , రానా (Rana )నటించిన భీంలా నాయక్ (Bheemal nayak )తాజాగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. మొదటి నుండి ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలో వసూలు చేస్తోంది .ఈ మూవీ సక్సెస్ సంబరాలు ఉన్న టీంకి ఘనంగా పార్టీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan ). తనకి భీంలా నాయక్ తో సూపర్ హిట్ అందించిన యూనిట్ మొత్తానికి తన ఫాం హౌస్లో అదిరిపోయే పార్టీ ఇచ్చారు.

ఈ పార్టీకి త్రివిక్రమ్(TRIVIKRAM ), తమన్ (S thaman )సంయుక్త (Samyukta ) డైరెక్టర్ సాగర్ కే చంద్ర ,ప్రొడ్యూసర్, లిరిక్ రైటర్స్, అలాగే సింగర్స్ పాల్గొన్నారు. ఇక సినిమా ఇంతలా వచ్చేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్ . ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో అదరగొడుతుంది. రెండు రోజుల్లోనే 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.