RX 100 సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మంచి కలెక్షన్లు సాధించాడు కార్తికేయ(Kartikeya ) .కానీ ఆ తర్వాత అతని సినిమాలు ఆశించిన రీతిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి.అయితే నేచురల్ స్టార్ నాని (Nani )హిరోగా నటించిన గ్యాంగ్ రీడర్ సినిమాలో కర్తికేయ విలన్ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది.ఇప్పుడు అజిత్ (Ajith )హీరోగా రాబోతున్న వలీమై (Valimai )చిత్రంలో కూడా ప్రతినాయకుడు పాత్ర పోషించాడు.ఈ సినిమాతో తమిళ్ మంచి క్రేజ్ వస్తుందని కార్తికేయ భావిస్తున్నాడు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ లో కార్తికేయ స్టైలిష్ విలన్ గా కనిపిస్తున్నారు.ఈ సినిమా ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీ ప్రమోషన్ లో తన మనసులో మాట బయట పెట్టాడు.తన అభిమాన హీరో చిరంజీవితో (Chiranjeevi )నటించాలని ఉందని తెలిపారు చిరంజీవి సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేసే ధైర్యం నాకు లేకపోయిన కనీసం ఆయనతో చిన్న క్యారెక్టర్ చేయలని నా కోరిక అంటూ కార్తికేయ(Kartikeya ) తన మనసులోని మాట బయట పెట్టాడు.