శ్రీలంకతో, టీమిండియా t20 (Ind vs SL t20 )సిరీస్ లో భాగంగా నేడు ధర్మశాలలో (DharmaShala )రెండవ టీ 20 మ్యాచ్ జరగాలి. కానీ పరిస్థితి చూస్తుంటే ఈ మ్యాచ్ జరిగేలా కనిపించడం లేదు .ధర్మశాలలో ఈరోజు ఉదయం నుండి భారీ వర్షం పడుతుంది .దానితో ఈరోజు టీ 20 మ్యాచ్ జరుగుతుంద లేదా అనే భావన కలుగుతోంది. ఇప్పటికే ధర్మశాలలో (Dharma shala )ఇలా వర్షం వల్ల అనేక మ్యాచ్లు రద్దయ్యాయి .

ఈరోజు జరిగే టి20(Ind vs sl T 20 ) కూడా అదే తీరున రద్దు అయ్యేటట్లు కనిపిస్తోంది. ఉదయం నుంచి వర్షం తగ్గకపోగా ,మరి ఎక్కువగా పడడంతో మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది .టీ 20 సిరీస్లో భాగంగా భారత్ (India )మొదటి మ్యాచ్లో శ్రీలంక మీద ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ నెగ్గాలని భావించిన రోహిత్ (Rohit sharma =సేనకు వరుణుడు అడ్డంగా మారుతున్నాడు. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది ,మరి ఆ లోపల వరుణుడు కరుణిస్తాడేమో చూడాలి.