నందమూరి నట సింహం బాలకృష్ణ(Balakrishna ) ఎలాంటి విషయాలలో అయినా తన స్టైల్లో చేస్తుంటారు. హీరోగానే కాకుండా రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ (TDP )ఎమ్మెల్యేగా బాలకృష్ణ ముందుకు సాగుతున్నారు. ఇక ఇటీవల విడుదలైన అఖండ(Akhanda ) సూపర్ హిట్ అయింది .సినిమా రేట్స్ తక్కువ ఉన్న సమయంలో కూడా బ్లాక్ బస్టర్ కొట్టి 100 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ సమయంలో బాలకృష్ణ(Balakrishna = ఏపీ సీఎం వైఎస్ జగన్(Ys jagan ) అపాయింట్మెంట్ కోరినట్లు వైయస్సార్సీపి మంత్రి పేర్ని నాని(Perni Nani ) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ఆ టైం లో బాలకృష్ణ(Balakrishna ), వైయస్ జగన్(Ys Jagan ) అపాయింట్మెంట్ తీసుకోవాలని కోరారట, అందుకు జగన్, బాలకృష్ణ కి ఫోన్ చేయగా టికెట్స్ రేట్స్ విషయమై మీతో మాట్లాడటానికి రావాలని ఆయన చెప్పారట, దాంతో బాలకృష్ణ లాంటి పెద్ద మనిషి టికెట్స్ రేట్స్ కోసం నన్ను కలవడానికి రావడం అంతగా బాగోదని ఆయనకు ఏం కావాలంటే అది చేసి పెట్టండి అంటూ పేర్ని నానితో సీఎం జగన్ చెప్పారట. ఈ విషయాన్ని మంత్రి పేర్ని నాని(Perni nani ) మీడియా సమావేశంలో తెలిపారు. ఇది నిజమో కాదో బాలకృష్ణ, అఖండ మూవీ నిర్మాతలు చెప్పాలంటూ తెలియజేశారు ,మేము అఖండ (Akhanda )మూవీ ని ఎలాంటి అఖండ మూవీని ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని, అలా ఇబ్బంది పెట్టి ఉంటే వాళ్ళు ఇప్పుడు చెప్పాలని పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.