టీ20ల్లో వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమ్ ఇండియాకి (India )షాక్ ఇస్తున్నాయి గాయాలు. ఇప్పటికే కొంత మంది స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా టి 20 సిరీస్ కి దూరం అవ్వగా ఇప్పుడు ఆ లిస్టులో మరో ప్లేయర్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ (Surya kumar yadav ), కేఎల్ రాహుల్(KL Rahul ) ,దీపక్ చాహర్ (Deepak Chahar )లాంటి స్టార్ ప్లేయర్స్ గాయాల కారణంగా జట్టు దూరమయ్యారు. ఇప్పుడు ఆ లిస్టు మరో యాంగ్ ప్లేయర్ చేరాడు.

ఇటీవల ఋతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad )చేతి మైనకట్టుకి గాయం అయ్యింది.దాంతో శ్రీలంకతో (Ind vs Sl T20 )జరుగుతున్న మొదటి టీ 20 మ్యాచ్ కి దూరమయ్యాడు. ఇక రెండో మ్యాచ్ కి అయినా సెట్ అవుతాడని అనుకున్న సమయంలో అతనికి గాయం తగ్గకపోవడంతో ఇప్పుడు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు .ఐపీఎల్ (IPL )అలాగే ప్రపంచ కప్ దగ్గరలో ఉన్న సమయంలో స్టార్ ఆటగాళ్లు గాయాల పాలు ఇవ్వడం అభిమానులు ఆందోళనకు గురి చేస్తోంది.