రష్యా (Russia), ఉక్రెయిన్ (Ukrain) ల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.  ఈ యుద్ధం లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.  కేంద్ర ప్రభుత్వం భారతీయులను సురక్షితం గా తీసుకు రావడానికి అన్ని చర్యలు చేపట్టింది. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi), రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడి న తరవాత యుద్ధానికి 6 గంటల విరామం కూడం ఇచ్చారు

భారతీయ విద్యార్థులు మెడిసిన్ (Medicine) చదివే దేశాల లో ఉక్రెయిన్ రెండవ స్థానం లో ఉంది.  మొదటి స్థానం లో చైనా ఉంది.  అయితే భారత సంతతికి చెందిన మెడికల్ విద్యార్థి మరణించడం ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ను కదిలించింది

యుక్రెయిన్ దాకా వెళ్లి మెడిసిన్ చదవడానికి కారణాలు ఏంటి.  భారత దేశం లో మెడికల్ కళాశాలల కొరత ఉందా.!  మౌలిక సదుపాయాలూ లేవా, అధిక ఫీజుల సమస్యా.

వీటన్నింటికి తెర దించుతూ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఆసక్తి కర ట్వీట్ చేసారు.  మహీంద్రా యూనివర్సిటీ (Mahindra University) క్యాంపస్ లో మెడికల్ కాలేజీ (Medical College) ని ఏర్పాటు చేయచ్చేమో అని ట్వీట్ (tweet) చేశారు

ఈ ట్వీట్ కి నెటిజెన్ ల అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  ఫీజులు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు.  అధిక ఫీజులే ప్రధాన సమస్య అని అందుకే మన విద్యార్థులు విదేశాల లో తక్కువ ఫీజులుండడం వలన అక్కడ చదవడానికి ఆసక్తి చూపుతున్నారు అని పలువురు నెటిజెన్ లు తెలిపారు.

హైదరాబాద్ (Hyderabad) లో మహీంద్రా యూనివర్సిటీ ఉండనే ఉంది.  కనుక హైదరాబాద్ లో మెడికల్ కాలేజీ వచ్చే అవకాశం ఉంటుంది.