భారత్ (India )లో సిరీస్ కి ముందు శ్రీలంక(Sree Lanka ) జట్టుకు బగ్ షాక్ తగిలింది.శ్రీలంక జట్టులో ఉన్న ప్రధాన ఆటగాడు వనిందు హసరంగ (Vanindu Hasaranga )భారత్ సిరీస్ కి దూరం అయ్యాడు. ఇతివల ఆస్ట్రేలియా(Australia) సిరీస్ లో భాగంగా హసరంగా కరోనా బారిన పడ్డాడు.కరోనా (Corona )నుండి అతను ఇంకా కొలుకోలేదు. ఇక ఇటీవల చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మరోసారి హసరంగకు కరోనా పాజిటివ్ వచ్చింది.అందుకే హసరంగా (Hasaranga )ఇండియాతో జరిగే టీ 20 సిరీస్ కి (Ind vs SL T20 )దూరం అయ్యాడు.

ఇక దీని తరువాత జరిగే టెస్టు సిరీస్‌లో కూడా హసరంగ పాల్గొనే దానిపై క్లారిటీ లేదు.శ్రీలంక టీమ్ పామ్ లో ఉన్న ప్లేయర్ హసరంగా …అతను లేకపోవడం శ్రీలంక జట్టుకు పెద్ద లోటు అని చెప్పాలి.ఇక ఐపీల్(IPL ) మెగా వేలంలో హసరంగ భారీ ధర పలికాడు.హసరంగను ఆర్సీబీ(RCB ) 10 కోట్ల 75 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.అతను కోలుకోకపోతే ఐపీల్ లో RCB టీమ్ కి కూడా నష్టం అని చెప్పాలి.