ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యాం. అనేక సార్లు వాయిదా పడిన ఈ చిత్రం చివరికి మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది .ఈ నేపథ్యంలో ప్రమోషన్ జోరుని కూడా పెంచింది .ఇక ఈ చిత్రానికి హిందీలో ఇండియన్ లెజెండ్రీ యాక్టర్ అమితాబచ్చన్ వాయిస్ ఓవర్ ఇవ్వగా ,తెలుగులో ఆ బాధ్యతని రాజమౌళి తీసుకున్నారట .ఇప్పటికే రాజమౌళి రాధే శ్యామ్ కు సంబంధించిన వాయిస్ ఓవర్ ని పూర్తి చేసినారు. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సిరీస్ ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

ఇక రాధే శ్యామ్ లో రాజమౌళి వాయిస్ చెప్పడంతో అంచనాలు మరింత పెరిగాయి .దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో వస్తున్న రాధే శ్యామ్ దేశంలోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇటీవలే విడుదల చేసిన ఈ తలరాత సాంగ్ సైతం సూపర్ క్రేజ్ ని సంపాదించుకుంది .బాహుబలి తర్వాత సాహో ఆకట్టుకోలేదు .దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ రాధే శ్యామ్ మీద భారీ అంచనాలతో ఉన్నారు.