వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ లో అద్బుతంగా రాణించాడు యంగ్ స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav ). వెస్టిండీస్ తో మూడో మ్యాచ్ లో అర్థ సెంచురితో భారత (India )విజయంలో కీలక పాత్ర వహించాడు. ఇక ఈ స్టార్ ప్లేయర్ కి గాయం అవడంతో శ్రీలంక సిరీస్ కి(IND vs SL 2022 ) దూరం అయ్యాడు.

టీ20 ల్లో నెంబర్ వన్ గా ఉన్న భారత్ కి (India )లంక సిరీస్‌కు ముందు బిగ్ షాక్ తగిలింది.ఇప్పటికే యువ బౌలర్ దీపక్ చాహర్ (Deepak chahar )సిరీస్ నుండి తప్పుకోగా ఇపుడు మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav ) కూడా లంకతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.

వెస్టిండీస్ తో మ్యాచ్ లో యాదవ్ కి ఫ్రాక్చర్ కావడంతో అతనికి మూడు వారాలు రెస్ట్ కావాలని డాక్టర్లు సూచించారు.దాంతో యాదవ్ శ్రీలంకతో టీ20 సిరీస్ కి దూరంగా అయ్యాడు. ఫిబ్రవరి 24 గురువారం నుంచి శ్రీలంకతో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్(IND vs SL T20 ) జరగనుంది.