అష్టా చమ్మా సినిమాతో హీరోగా పరిచయమైన నాని(Nani ) మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తరువాత మంచి విజయాలు సాధించి నేచురల్ స్టార్ గా ఎదిగాడు.ఇక ఇటీవల నాని హిరోగా సాయి పల్లవి (Sai Pallavi ), కృతి శెట్టి(Krithi Shetty ) హీరోయిన్స్ గా వచ్చిన శ్యామ్ సింగరాయ్(Shyam Singh Roy ) సినిమా అన్ని చోట్లో మంచి హిట్ సొంతం చేసుకుంది. ఇక తన తదుపరి సినిమా అంటే సుందరానికి (Ante Sundaraniki)చిత్రం రెడీగా ఉంది.

నాని పుట్టినరోజు(nan birthday )సందర్భంగా ఈ సినిమా నుండి నాని ఫస్ట్ లుక్ విడుదల చేసారు.బ్రాహ్మణ యువకుడిగా నాని లుక్ అదిరిపోయింది.ఈ ఫస్ట్ లుక్ తో అంటే సుందరానికి(Ante sundaraniki )తో నాని ఫుల్ వినోదం పంచబోతున్నట్లు అర్థం అవుతోంది.ఈ సినిమాని వివేక్ ఆత్రేయ(Vivek Athreya) దర్శకత్వం వహిస్తుండగా,వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ మూవీ థియేటర్స్ లో విడుదలకు రెడీ అయినట్టు అంటే సుందరానికి టీమ్ ప్రకటించారు.