టీ 20ల్లో టీమిండియా ( Team India ) జోరు మీద ఉంది .వరుస విజయాలు సాధిస్తూ నెంబర్ వన్ ర్యాంక్ లో నిలిచింది. ఇటీవల వెస్టిండీస్ తో టీ20 సిరీస్(Ind vs WI T20) గెలిచిన భారత్, శ్రీలంకతో టీ 20 సిరీస్ (IND vs SL T 20 )కి సిద్ధం అయింది. కానీ ఈ సిరీస్ కు ముందే భారత్ కి షాక్ తగిలింది.టీమిండియా స్టార్ బౌలర్ దీపక్ ఛాహార్(Deepak Chahar ) ఈ సిరీస్ కి దూరం అయ్యాడు.

వెస్టిండీస్ తో జరిగిన 3వ మ్యాచ్ లో గాయపడిన దీపక్ ఛాహార్ నొప్పి (Deepak Chahar )ఎక్కువ కావడంతో ఆ మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు.గాయం ఇంకా తగ్గకపోవడంతో శ్రీలంకతో(Sree lanka ) జరిగే టీ 20 సిరీస్ కి దూరం అయ్యాడు. ఈ విషయాన్ని బిసిసిఐ (BCCI)అధికారి తెలియచేసారు.శ్రీలంకతో టీ 20 సిరీస్ ఫిబ్రవరి24 నుండి స్టార్ట్ కానుంది. ఈ సిరీస్ లో భారత్ ,శ్రీ లంక 3(IND Vs SL T 20 ) మ్యాచ్ లో తలపడతాయి.