శర్వానంద్ హీరోగా(Sharwanand ), రష్మిక మందన(Rashmika ) హీరోయిన్ గా కలసి నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు(Aadavaallu meeku Joharlu ). ఈ సినిమా మర్చి 4న విడుదల అవుతోంది. ఇప్పటికే ఈమూవి నుండి వచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇపుడు మాగళ్యం తంతునేన(Magalyam Tanthunena ) అనే సాంగ్ విడుదల చేశారు.ఈ సాంగ్ ఊహించిన స్థాయిలో సంగీత ప్రియులని అలరిస్తోంది. దేవిశ్రీప్రసాద్(DSP) సంగీతం నుండి వచ్చిన ఈ పాట యుట్యూబ్ లో వైరల్ గా మారింది.

ఇక చిన్నప్పటి నుండి ఆడవళ్ల మధ్య పెరిగిన హీరోకి పెళ్లి చేయలనే విషయంలో తల్లి పడే ఆవేదనే ఈ సినిమా కాన్సెప్ట్. రాధిక శరత్(Radhika Sharath Kumar ) కుమార్ ,ఖుష్బూ, ఊర్వశిలాంటి సీనియర్ నటులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.భీంలా నాయక్ (Bheemla Nayak )వల్ల వాయిదా పడిన ఈ మూవీ మార్చ్ 4న విడుదల అవుతుండగా ఎలాంటి హిట్ సాదిస్తుందో చూడాలి.