నటీనటులు: యామీ గౌతమ్, అతుల్ కులకర్ణి, నేహా ధూపియా

దర్శకత్వం : బెహజాద్

నిర్మాతలు: రోనీ స్క్రూవాలా, ప్రేమనాథ్ గోపాలన్

సంగీత దర్శకుడు: రోషన్ దళాల్, కైజా

కూర్పు: సుమిత్

మాటలు: విజయ్ మౌర్య

విడుదల తేదీ : ఫిబ్రవరి 19,
2022 ( ‘డిస్నీ+ హాట్ స్టార్’)

విక్కీ డౌనార్‌, ఉరి, గౌరవం, కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌ వంటి సినిమాలతో అటు హిందీ, ఇటు తెలుగు అభిమానుల్ని అలరించిన ముద్దుగుమ్మ యామీ గౌతమ్‌ తాజాగా మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. యామీ గౌతమ్, అతుల్ కులకర్ణి, నెహాధూపియ కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ఏ థర్స్ డే (A Thursday) బెహజాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్ ఫామ్ ‘డిస్నీ+ హాట్ స్టార్’లో ఫిబ్రవరి 19న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ :

నైనా జైస్వాల్ (యామి గౌతమ్) వృత్తిరీత్యా లాయర్. కానీ ఆమెకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ముంబైలోని ఓ పే స్కూల్ లో టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆరోగ్యం బాగలేకపోవడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ స్కూల్ కు వస్తుంది. ఒకరోజు నైనా జైస్వాల్ ఆ స్కూల్ లో ఉండే 16 మంది పిల్లలను కిడ్నాప్ చేస్తుంది. వారిని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే తన డిమాండ్స్ నెరవేర్చాలని పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఆఖరికి ఈ విషయం అదే రోజు ముంబైకి వచ్చిన ప్రధానమంత్రి మాయా రాజ్ గురు (డింపుల్ కపాడియా) దృష్టికి వెళ్తుంది. అసలు నైనా జైశ్వాల్ ఎవరు? ఆమె 16 మంది స్కూల్ విద్యార్థులను ఎందుకు కిడ్నాప్ చేసింది ? ఆమె డిమాండ్స్ ఏంటి? ఈ కిడ్నాప్ తో ప్రధానమంత్రికి ఉన్న సంబంధం ఏంటో అనేది తెలియాలి అంటే ఈ మూవీని హాట్ స్టార్ లో చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

క్రైమ్ త్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ప్రతీ ఇండస్ట్రీలోనూ ఇలాంటి కథలు కొత్తేమి కాదు. అయితే క్రైమ్ త్రిల్లర్ అనే కాన్సెప్ట్ ను ఎవరు ఎలా ఉపయోగించుకొని ఆసక్తిగా తెరకెక్కించారన్నదానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. సమాజంలోని నిర్లక్ష్య వైఖరి మీద పోరాటం చేసే వ్యక్తుల కథలతో చాలానే సినిమాలు వచ్చాయి. అలాంటి కథతోనే కాన్సెప్ట్ ను తీసుకొని తికమక లేకుండా ప్రేక్షకులను ఆఖరి వరకు సినిమాను ఉత్కంఠతో చూసేలా చేయడంలో దర్శకుడు బెహజాద్ విజయం సాధించాడు. ఇక నటిగా యామీ గౌతమ్ మరోసారి ఆదరగొట్టింది. సినిమా ఆరంభం నుంచి క్లైమాక్స్ వరకు ఆమె తన నటన సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇందులో కీలక పాత్రల్లో నటించిన నేహా దుపియా, దింపుల్ కపాడియా మరియు అతుల్ కులకర్ణి తమ పరిది మేరకు అలరించారు. కథంతా ఒక్కరోజులో జరిగేది కావడంతో ఆసక్తికరంగా సాగింది. క్యాస్టింగ్‌, సాంకేతికంగా బాగానే వర్క్‌ చేసినట్టు కనిపిస్తుంది. ఆర్ట్‌, కెమెరా పనితనం మొత్తంగా చిత్ర యూనిట్ ఎఫర్ట్‌ స్క్రీన్‌పై కనిపించింది. రోషన్ దళాల్, కైజా సంగీతం చాలా బాగుంది. తమదైన బీజీఎంతో కొన్ని సీన్లకి ప్రాణం పోశారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
కథ, కథనం
ప్రధాన పాత్రల నటన
సంభాషణలు
బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:
ఊహకు తగ్గట్లుగా సాగే కథ
సాగదీత సన్నివేశాలు

రేటింగ్ : 2.5/5