దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli),
యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr), మెగా పవర్ స్టార్ రామ్చరణ్(Ram Charan) ల కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం “ఆర్ఆర్ఆర్” (RRR) దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీలో కొమురం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. ఇందులో ఎన్టీఆర్ కు జోడిగా ఒలివియా మోరీస్, రామ్ చరణ్ కు జోడిగా అలియా భట్ నటించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీత స్వరాలు సమకూర్చారు.
ఈ సినిమా మార్చి 25న విడుదల కానుండగా.. ప్రమోషస్స్లో జోరు పెంచారు చిత్రబృందం. ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా రన్ టైమ్ విహయనికొస్తే.. 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు. రాజమౌళి గత సినిమా బాహుబలి 2 మూవీ టైమ్ 2 గంటల 47 నిమిషాలు. ఇప్పుడు బాహుబలి – 2 మూవీ కంటే ఆర్ఆర్ఆర్ రన్ టైమ్ ఎక్కువగా ఉండటం విశేషం.
Recent Comment