ప్రముఖ సినీనటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇటీవల కేసు నమోదైన సంగతి తెలిసిందే. మంచు విష్ణు (Manchu Vishnu) దగ్గర బోరబండకు చెందిన నాగశ్రీను(Naga Srinu) అనే వ్యక్తి హెయిర్ డ్రెస్సర్ గా (Hair dresser) పనిచేస్తున్నాడు. ఈ నెల 17న మంచు విష్ణు కార్యాలయం నుంచి రూ.5లక్షల విలువైన
హెయిర్ డ్రెస్ సామాగ్రిని నాగ శ్రీను దొంగతనం చేసినట్లు తెలుపుతూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మంచు విష్ణు మేనేజర్ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీను పంపిన ఒక సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (social media) వైరల్ గా మారింది. తనపై మంచు కుటుంబం కావాలనే అక్రమ కేసు పెట్టిందని హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీను సంచలన వ్యాఖ్యలు చేశాడు. మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu) ఫ్యామిలీ కులం పేరుతో దూషించడం వల్లే వారి దగ్గర ఉద్యోగం మానేశానని నాగశ్రీను తెలిపాడు. ఫిబ్రవరి17న మోహన్ బాబు (Mohan Babu) నన్ను మోకాళ్ళ మీద కూర్చోపెట్టి కొట్టడం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. నాపై అక్రమ కేసులు పెట్టడంతో ఆ విషయం తెలిసి నా తల్లికి హార్ట్ ఎటాక్ వచ్చింది. అని నాగశ్రీను (Naga srinu) కన్నీరుమున్నీరయ్యాడు.
Recent Comment