పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ), రానా దగ్గుపాటి (Rana Daggubati )హీరోలుగా భీంలా నాయక్ ట్రైలర్(Bheemla Nayak ) వచ్చేసింది. ఇప్పటికే యూట్యూబ్ లో మిలియన్స్ కొద్ది వ్యూస్ సాదిస్తూ రికార్డ్స్ కొల్లగొడుతోంది.ఇక 21న ఈసినిమా ఫ్రి రిలీజ్ ఈవెంట్ (Bheemla Nayak Free Release Event )జరగవలసి ఉండగా ఏపి మంత్రి గౌతమ్ రెడ్డి(Goutham Reddy ) ఆకస్మిక మరణంతో భీమ్లానాయక్ ఈవెంట్ నిలిచిపోయింది. అయితే ఇపుడు ఈ వేడుకను 24 తేదీన హైదరాబాద్ లోని యూసప్ గూడా పోలిస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు.
ముందుగా ప్రకటించినట్టు తెలంగాణ మంత్రి KTR అలాగే పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్న డైరెక్టర్స్ ఈ ఈవెంట్ లో పాల్గొంటారు.
నిథ్యామీనన్ ,సంయుక్తమీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన బిమ్లానాయక్ ఫిబ్రవరి25న థియేటర్స్ కి రానుంది.
Recent Comment