కేంద్ర ప్రభుత్వం sc స్టూడెంట్స్ కి శుభవార్త చెప్పింది. స్టూడెంట్స్ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ స్కీంకి చెందిన విషయంపై కేంద్ర కొత్త ఆదేశాలు ఇచ్చింది. SC స్టూడెంట్స్ కి ఫీజు రీయింబర్స్మెంట్ అలాగే ఉపకార వేతనాల స్కీంకు డబ్బులను కాలేజీలకు కాకుండా స్ట్రెయిట్ గా స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ లో వేయాలని తెలిపింది.దీనిపై పక్కా హామీ ఇచ్చి నిర్ణయం తీసుకుని నివేదికను కేంద్రానికి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

ఇప్పటికి వరకు విద్యార్థులకు రావాల్సిన ఫీజు పేమెంట్స్ ని రాష్ట్ర ప్రభుత్వాలు కాలేజీలకు ఇస్తున్నాయి.కానీ కాలేజీ సంస్థలకు ఫీజులు ఇవ్వడానికి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ తప్పు పట్టింది. Sc స్టూడెంట్స్ కి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలో వేయాలని కేంద్ర ఆదేశించింది.