Bholaa Shankar Release Update: ‘భోళాశంకర్’ విడుదలయ్యేది అప్పుడే!

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కథానాయకుడిగా మోహర్‌ రమేశ్‌ (Mehar Ramesh) దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘భోళా శంకర్‌’(Bholaa Shankar). తమిళ సూపర్‌ హిట్‌ మూవీ వేదాళం తెలుగు రీమేక్ గా‏ ఇది తెరకెక్కుతోంది. మహతి స్వర సాగర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని.. ఏకె ఎంటర్ టైన్ మెంట్స్(Ak Entertainments) బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇటీవల శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసిన ‘భోళాశంకర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే, తాజా సమాచారం ప్రకారం ‘భోళాశంకర్’ మూవీని ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య'(Acharya) ఏప్రిల్ 29న రిలీజ్ అవుతుంది. అందుకే ఈ సినిమా విడుదలైన ఆరు నెలల వ్యవధిలోనే ‘భోళాశంకర్’ ను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇక ‘భోళాశంకర్’ లో కథానాయికగా తమన్నా(Tammanah), చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్(Keerthi Suresh) నటిస్తున్నారు.