ప్రతి రోజు లక్షల్లో భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వస్తూ ఉంటారు.కరోన వల్ల తక్కువ మందిని మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. చాలా మంది భక్తులకు శ్రీవారి దర్శనం కష్టంగా మారింది. కానీ తిరుమలకు వచ్చే భక్తులకు TTD శుభవార్త చెప్పింది.రిజు వారి టికెట్లను పెంచుతున్నట్లు తెలిపింది. TTD రోజువారీ Online Tickets 10 వేలకు పెంచుతున్నట్లు ఇవో జవహర్ రెడ్డి తెలిపారు.కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకి 10వేల టికెట్ లను TTD Online లో అందుబాటులో తెస్తోంది.ఫిబ్రవరి 16 నుండి తిరుపతిలో సర్వ దర్శనం టికెట్స్ ని జారీ చేస్తారు.కరోన తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. రోజు వారీ టికెట్స్ ని TTD ప్రధాన వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు.ఈ నిర్ణయంతో ఎక్కువ భక్తులు శ్రీవారిని దర్శించుకోడానికి అవకాశం లభిస్తుంది.
Recent Comment