ఇండియన్(Indian first class cricket ) ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కొత్త రికార్డ్ నమోదు అయ్యింది.2022 రంజీ ట్రోఫీలో ( Ranji Trophy ) ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఇన్నింగ్స్ లో సెంచరీలు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. తమిళనాడు జట్టులో ఇద్దరు కవల సోదరులు భారీ స్కోరు నమోదు చేసారు. తమిళనాడు(Tamilnadu ) – ఛత్తీస్‌గఢ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తమిళనాడు అన్నదమ్ములు బాబా ఇంద్రజిత్(Baba indrajith ) ,బాబా అపరజిత్ (Bab aparajith)ఒకే ఇన్నింగ్స్ లో ఇద్దరు సెంచురీలు నమోదు చేయడం విశేషం.
బాబా అపరాజిత్ 267 బంతుల్లో 166 పరుగులు చేసాడు. అందులో 15 పోర్లు ,4 సిక్స్ లు ఉన్నాయి.ఇక బాబా ఇంద్రజిత్ 141 బంతుల్లో 127 పరుగులు చేసాడు. ఇందులో21 పోర్లు ఉన్నాయి. ఈ అన్నదమ్ములు ఇద్దరు 206 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి బ్యాటింగ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.