వపర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమా అంటే ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో వస్తుందా అని ఆయన వీరాభిమానులు ఎంతగానో ఎదురు చూస్తువుంటారు. అయితే ఈ నెల 25న భీమ్లానాయక్(Bheemla Nayak ) సినిమా విడుదల అవుతుండడంతో ముందుగానే టిక్కెట్లు బుకింగ్ విషయంలో కొన్ని ఇబ్బందులని క్లియర్ చేసారు నైజామ్ ఏరియా డిస్ట్రిబ్యూటర్స్. బుక్ మై షో (Book my Show )అదనపు టికెట్ చార్జ్ వసూళ్ళు చేస్తున్న నేపథ్యంలో నైజామ్ ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ యాజమాన్యం పద్ధతి మార్చుకోకపోతే టికెట్స్ థియేటర్స్ లోనే అమ్మకాలు కొనసాగించవలసి ఉంటుందని తేల్చి చెప్పడంతో, బుక్ మై షో ఒక క్రమ పద్ధతి పాటిస్తామని ఒక మెట్టు దిగి వచ్చింది.దాంతో బుక్ మై షో ఆన్లైన్ బుకింగ్ స్టార్ట్ చేసింది .ఇప్పటికే చాలవరకు టిక్కెట్స్ బుక్ అయినట్టు సమాచారం. ఇక ఎన్నో అంచనాలు క్రీయేట్ చేసిన భీమ్లానాయక్ (Bheemla Nayak )రెండు రోజుల్లో థియేటర్స్ లో అడుగు పెట్టబోతోంది.