గ్రకథానాయకుడు సూర్య (Surya) హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఈటి.’ (ET) ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో మార్చి 10న విడుదల కానుంది. ముగుస్తుంది. సూర్యకు జోడిగా ప్రియాంకా అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) నటించిన ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందించగా.. కెమెరామెన్ గా ఆర్ రత్నవేలు పనిచేశారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్రయూనిట్ హైదరాబాద్(Hyderabad)లో నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని దస్పల్లా కన్వెన్షన్‌లో ప్రీ వేడుక ఘనంగా జరగనుంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి ముగ్గురు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. యువ హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati), టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) ,సీనియర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dill Raju) ఈ వేడుకలో సందడి చేయనున్నారు.
Recent Comment